బాహుబలి’ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అందుకే ఆ సినిమాకు అంత పెద్ద విజయం దక్కింది. ఇప్పటికీ రిపీట్ మోడ్లో జనాలు చూస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఎవరూ ఊహించని సర్ప్రైజ్ కిలికిలి భాష. కాలకేయులు ఈ భాషలోనే మాట్లాడుతుంటారు. ఇదేదో శబ్దాల కూడిక కాదు.. పూర్తి స్థాయి భాష అని సినిమా ప్రచారంలో చిత్రబృందం చెప్పింది. ఆ మేరకు వివరాలు కూడా వెల్లడించింది. ఇప్పుడు ఇదే తరహా ప్రయత్నం మరోసారి రాజమౌళి చేస్తున్నారని సమాచారం.
Varanasi
అవును.. రాజమౌళి కొత్త సినిమా ‘వారణాసి’కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అదే ఈ సినిమా కోసం కూడా రాజమౌళి అండ్ కో. ఓ భాషను సిద్ధం చేస్తున్నారట. ఓ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ను ప్రత్యేకంగా ఈ సినిమా కోసం నియమించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓ పురాతన లిపిని సిద్ధం చేస్తున్నారట. సినిమాలోని టైమ్ ట్రావెల్ ఎపిసోడ్లో భాగంగా పాత్రలు ఓ గుహలోకి ప్రవేశించినప్పుడు ఈ లిపి కనిపిస్తుందట. అక్కడి నుండి సినిమా ఆసక్తికర మలుపు తిరుగుతుందట.

